మే 3 వరకు అన్ని మ్యాచ్‌లను వాయిదా వేసిన ఎంసీఏ

ABN , First Publish Date - 2020-04-15T02:19:25+05:30 IST

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగించిన నేపథ్యంలో అన్ని మ్యాచ్‌లను అప్పటి వరకు వాయిదా వేస్తున్నట్టు

మే 3 వరకు అన్ని మ్యాచ్‌లను వాయిదా వేసిన ఎంసీఏ

ముంబై: దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగించిన నేపథ్యంలో అన్ని మ్యాచ్‌లను అప్పటి వరకు వాయిదా వేస్తున్నట్టు ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) తెలిపింది. గత నెలలో కేంద్రం 21 రోజులపాటు లాక్‌డౌన్‌ను ప్రకటించడంతో ఏప్రిల్ 14 వరకు స్థానిక మ్యాచ్‌లను వాయిదా వేసింది. తాజాగా, లాక్‌డౌన్‌ను మరోమారు పొడిగించడంతో ఎంసీఈ ఈ నిర్ణయం తీసుకుంది. నిజానికీ మ్యాచ్‌లు మార్చి 14 నుంచి మే 3 మధ్య జరగాల్సి ఉందని ఎంసీఏ తెలిపింది. అలాగే, వాంఖడే స్టేడియం ఆవరణలో ఉన్న ఎంసీఏ కార్యాలయాన్ని కూడా వచ్చే నెల మూడో తేదీ వరకు మూసివేస్తున్నట్టు పేర్కొంది. 

Updated Date - 2020-04-15T02:19:25+05:30 IST