హాఫ్ సెంచరీ చేసిన మాథ్యూ వేడ్
ABN , First Publish Date - 2020-12-08T20:09:28+05:30 IST
టీమిండియాతో జరుగుతున్న మూడో టీ20లో ఆసీస్ బ్యాట్స్‌మన్ మాథ్యూ వేడ్ దాటిగా ఆడుతున్నాడు. 35 బంతుల్లో 50 పరుగులు చేశాడు.
సిడ్నీ: టీమిండియాతో జరుగుతున్న మూడో టీ20లో ఆసీస్ బ్యాట్స్‌మన్ మాథ్యూ వేడ్ దాటిగా ఆడుతున్నాడు. 35 బంతుల్లో 50 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్సులో 7 ఫోర్లు ఉన్నాయి. మరోవైపు నిలకడగా ఆడుతున్న స్మిత్ పదో ఓవర్లో అవుట్ అయ్యాడు. వ్యక్తిగత స్కోర్ 24 పరుగుల దగ్గర వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం క్రీజులో మాథ్యూ, గ్లెన్ మ్యాక్స్ వెల్ ఉన్నారు. ఆసీస్ స్కోర్ 11 ఓవర్లకు రెండు వికెట్లు కోల్పోయి 87 పరుగులు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ రెండు వికెట్లు తీసుకున్నాడు.