30న రీతు బౌట్‌

ABN , First Publish Date - 2020-10-14T09:19:30+05:30 IST

రెజ్లింగ్‌ నుంచి మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ (ఎంఎంఏ)కు మారిన భారత అమ్మాయి రీతూ ఫొగట్‌ ఈనెల 30న జరిగే బౌట్‌లో తన అదృష్టాన్ని...

30న రీతు బౌట్‌

న్యూఢిల్లీ: రెజ్లింగ్‌ నుంచి మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ (ఎంఎంఏ)కు మారిన భారత అమ్మాయి రీతూ ఫొగట్‌ ఈనెల 30న జరిగే బౌట్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. సింగపూర్‌ వేదికగా జరిగే ఈ పోటీల్లో నాలుగు వరల్డ్‌ టైటిల్‌ బౌట్లతో కలిపి మొత్తం ఆరు మ్యాచ్‌లు జరగ నున్నాయి. రీతు 52 కిలోల విభాగంలో కాంబోడి యాకు చెందిన నౌ స్రే పొవ్‌తో తలపడనుంది. ‘ఈ బౌట్‌ కోసం చాలా రోజులుగా ఎదురు చూస్తున్నా. ఈనెల 30న జరిగే బౌట్‌లో సత్తా చాటి ఎంఎంఏకు భారత్‌ ఒక పవర్‌హౌస్‌ వంటిదని నిరూపిస్తా’ అని రీతు చెప్పింది.

Updated Date - 2020-10-14T09:19:30+05:30 IST