ఎన్ని గుండెలుంటే నా భర్త పేరు అలా రాస్తావ్?.. నెటిజన్‌పై క్రికెటర్ భార్య ఫైర్

ABN , First Publish Date - 2020-06-02T01:59:11+05:30 IST

భారత బ్యాట్స్‌మెన్ మనోజ్ తివారీ పేరును ‘ఫ్లాప్ క్రికెటర్ల జాబితా’లో చేర్చిన ఓ నెటిజన్‌పై అతని భార్య సుస్మిత మండిపడింది.

ఎన్ని గుండెలుంటే నా భర్త పేరు అలా రాస్తావ్?.. నెటిజన్‌పై క్రికెటర్ భార్య ఫైర్

ముంబై: భారత బ్యాట్స్‌మెన్ మనోజ్ తివారీ పేరును ‘ఫ్లాప్ క్రికెటర్ల జాబితా’లో చేర్చిన ఓ నెటిజన్‌పై అతని భార్య సుస్మిత మండిపడింది. ‘నీకెన్ని గుండెలుంటే నా భర్త పేరును ఆ లిస్టులో పెడతావ్? నిజాలు తెలుస్కోకుండా నోటికొచ్చినట్లు రాస్తావా? ఇలాంటి చెత్త రాసే బదులు నీ ఛండాలమైన జీవితానికి ఉపయోగపడే పనేదైనా చేస్కో’ అంటూ ఆగ్రహం వ్యక్తంచేసింది. ట్విట్టర్‌లో ఐపీఎల్ ఫ్రీక్ అనే పేరుతో ఓ వ్యక్తి.. ‘టీమిండియాలోని 11 మంది ఫ్లాప్ క్రికెటర్లు’ అంటూ ఓ జాబితాను విడుదల చేశాడు. అందులో మనోజ్ తివారీ పేరును కూడా చేర్చడంతోనే సుస్మిత ఆగ్రహోదగ్ధురాలైపోయింది. తన భర్తను కించపరిచినందుకు సదరు నెటిజన్‌పై దుమ్మెత్తిపోసింది.

Updated Date - 2020-06-02T01:59:11+05:30 IST