బోర్డు నిర్ణయాన్ని గౌరవిస్తా

ABN , First Publish Date - 2020-03-16T10:24:13+05:30 IST

కామెంటరీ ప్యానెల్‌ నుంచి తనను తొలగించిన బీసీసీఐ నిర్ణయాన్ని గౌరవిస్తానని మాజీ ఆటగాడు సంజయ్‌ మంజ్రేకర్‌ తెలిపాడు. ‘కామెంటేటర్‌గా

బోర్డు నిర్ణయాన్ని గౌరవిస్తా

కామెంటరీ నుంచి ఉద్వాసనపై మంజ్రేకర్‌


న్యూఢిల్లీ: కామెంటరీ ప్యానెల్‌ నుంచి తనను తొలగించిన బీసీసీఐ  నిర్ణయాన్ని గౌరవిస్తానని మాజీ ఆటగాడు సంజయ్‌ మంజ్రేకర్‌ తెలిపాడు. ‘కామెంటేటర్‌గా నా ఎంపిక నాకు దక్కిన గౌరవంగానే భావించా, కానీ అదో హక్కుగా అనుకోలేదు. నన్ను కొనసాగించాలా.. లేదా అనేది నా యజమానికి సంబంధించిన విషయం. వారు తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తా. నా పనితీరు బీసీసీఐకి నచ్చలేదేమో.. ఓ ప్రొఫెషనల్‌గా దీన్ని అంగీకరిస్తున్నా’ అని మంజ్రేకర్‌ ట్వీట్‌ చేశాడు. 

Updated Date - 2020-03-16T10:24:13+05:30 IST