వారి మానసిక పరిస్థితి బాగోలేదు !
ABN , First Publish Date - 2020-05-29T09:07:18+05:30 IST
ధోనీ రిటైర్మెంట్పై సోషల్‌మీడియాలో మరోసారి వార్తలు హల్చల్ చేశాయి. ‘ధోనీ రిటైర్స్’ అనే హాష్‌ట్యాగ్ ట్విటర్లో ట్రెండింగ్‌గా మారడంతో మహీ ...

ధోనీ రిటైర్మెంట్ వార్తలపై సాక్షి స్పందన
కొద్దిసేపటికే ట్వీట్ తొలగింపు
న్యూఢిల్లీ: ధోనీ రిటైర్మెంట్పై సోషల్‌మీడియాలో మరోసారి వార్తలు హల్చల్ చేశాయి. ‘ధోనీ రిటైర్స్’ అనే హాష్‌ట్యాగ్ ట్విటర్లో ట్రెండింగ్‌గా మారడంతో మహీ భార్య సాక్షి స్పందించింది. ఆ వార్తలను కొట్టిపారేసింది. ‘అవన్నీ పుకార్లు. లాక్డౌన్ సమయంలో ప్రజల మానసిక పరిస్థితి సరిగాలేని విషయాన్ని అర్థం చేసుకోగలను’ అని ట్వీట్ చేసింది. అయితే ఆ ట్వీట్ బాగా వైరల్ కావడంతో ఆమె దానిని వెంటనే తొలగించింది.
అతడికే వదిలేయండి: రిటైర్మెంట్ విషయాన్ని ధోనీకే వదిలేయాలని టీమిండియా మాజీ కోచ్ గ్యారీ కిర్‌స్టెన్ అన్నాడు. ‘మహీ అద్భుత క్రికెటర్. ఆటకు ఎప్పుడు వీడ్కోలు పలకాలో నిర్ణయించుకొనే హక్కు అతడి సొంతం. ఈ విషయంలో ఎవరూ ధోనీపై ఒత్తిడి తీసుకురావొద్దు’ అని కిర్‌స్టెన్ సూచించాడు.