బీసీసీఐ ఉపాధ్యక్ష పదవికి మహీమ్ వర్మ రాజీనామా

ABN , First Publish Date - 2020-04-14T23:24:28+05:30 IST

ఉత్తరాఖండ్ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీగా ఎంపిక అయిన నేపథ్యంలో బీసీసీఐ ఉపాధ్యక్ష పదవికి మహీమ్ వర్మ రాజీనామా చేశారు. తన రాజీనామా

బీసీసీఐ ఉపాధ్యక్ష పదవికి మహీమ్ వర్మ రాజీనామా

ముంబై: ఉత్తరాఖండ్ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీగా ఎంపిక అయిన నేపథ్యంలో బీసీసీఐ ఉపాధ్యక్ష పదవికి మహీమ్ వర్మ రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని ఆయన సీఈవో రాహుల్ జోహ్రీకి అందించారు. బీసీసీఐ నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి రాష్ట్ర పరిధిలో కానీ, కేంద్ర పరిధిలో కానీ ఒకేసారి రెండు పదవుల్లో ఉండకూడదు. ఈ కారణంగానే మహీమ్ ఈ పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. 


తన రాజీనామా గురించి మహీమ్ వర్మ మాట్లాడుతూ.. ‘‘నా రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్‌ని సరైనా దారిలో పెట్టాల్సిన అవసరం ఉంది. అందుకే నా రాజీనామాను రాహుల్ జోహ్రీకి అందజేశాను. సీనియర్ అధికారులు దాన్ని పరిశీలించి ఆమోదిస్తారిని భావిస్తున్నాను. జై షాకి నా అవసరాల గురించి ముందే చెప్పాను. నేను తిరిగి వెళ్లి.. రాష్ట్ర అసోసియేషన్ బాధ్యతలు చేపట్టపోతే.. మొత్తం అతలాకుతలం అవుతుంది. అందుకే నేను ఆ ఎన్నికల్లో పోటీ చేశాను’’ అని అన్నారు. 


అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో బీసీసీఐ జనరల్ బాడీ సమావేశం జరిగే పరిస్థితులు లేవు. ఉపాధ్యక్ష పదవి ఖాళీ అయిన 45 లోపు ఈ సమావేశం జరగాలి. అయితే లాక్‌డౌన్ ముగిన తర్వాతే ఇది జరిగే అవకాశం ఉంది. అయితే ఈ పదవి కోసం ఎవరు పోటీ చేస్తారనే విషయంలో ఇంకా స్పష్టత లేదు.

Updated Date - 2020-04-14T23:24:28+05:30 IST