ధోనీ బాధలో ఉన్నాడు
ABN , First Publish Date - 2020-06-16T10:05:46+05:30 IST
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌తో భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకున్న అనుబంధం గురించి ప్రత్యేకంగా...

సుశాంత్ ఆత్మహత్యపై మహీ మేనేజర్ పాండే
రాంచీ: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌తో భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకున్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే, సుశాంత్ మరణ వార్త తెలుసుకొని పలువురు క్రికెటర్లతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా స్పందించగా.. ధోనీ మాత్రం ఇప్పటివరకు నోరు విప్పలేదు. దీనిపై అతడి మేనేజర్ అరుణ్ పాండే వివరణ ఇచ్చాడు. ‘సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడనే వార్త ధోనీని తీవ్రంగా కలిచివేసింది. అతడు బాధలో ఉన్నాడు. ఈ విషయాన్ని మేం జీర్ణించుకోలేకపోతున్నాం. మహీ బయోపిక్ కోసం మాజీ కీపర్ కిరణ్ మోరె శిక్షణలో సుశాంత్ చాలా కష్టపడ్డాడు. అతడి అంకితభావాన్ని చూసి ధోనీ ఆశ్చర్యపోయేవాడు. అలాంటి సుశాంత్ మన మధ్య లేడనే వార్త ను నమ్మలేకపోతున్నాం’ అని అరుణ్ విచారం వ్యక్తం చేశాడు.