మెరుపు కోసం తడి టవల్‌ను వాడొచ్చు..
ABN , First Publish Date - 2020-07-08T08:09:49+05:30 IST
బంతి మెరుపు కోసం ఉమ్మికి బదులు తడిగా ఉండే టవల్ ప్రత్యామ్నాయం కాగలదని దక్షిణాఫ్రికా పేసర్ లుంగీ ఎన్గిడి సూచించాడు...

కేప్‌టౌన్: బంతి మెరుపు కోసం ఉమ్మికి బదులు తడిగా ఉండే టవల్ ప్రత్యామ్నాయం కాగలదని దక్షిణాఫ్రికా పేసర్ లుంగీ ఎన్గిడి సూచించాడు. ‘లాలాజలం పూయడంపై ఐసీసీ నిషేధం విధించగానే పలువురు బ్యాట్స్‌మెన్ ఇక తమదే ఆధిపత్యం అనే రీతిలో గ్రూపుల్లో పోస్ట్ చేశారు. దీని ద్వారా వారిప్పటికే మానసికంగా సిద్ధమయ్యారని భావించవచ్చు. అందుకే బౌలర్లు స్వింగ్ కోసం మరో ప్రత్యామ్నాయంగా తడి టవల్ ద్వారా బంతికి మెరుపు సాధించవచ్చు’ అని ఎన్గిడి తెలిపాడు.