మెల్బోర్న్లో లాక్డౌన్
ABN , First Publish Date - 2020-07-08T08:05:44+05:30 IST
ఆస్ట్రేలియాలోని రెండో అతిపెద్ద నగరమైన మెల్బోర్న్లో మరో ఆరు వారాలపాటు లాక్డౌన్ విధించారు. దీంతో ఆ దేశంలో షెడ్యూల్ ప్రకారం ...

టీ20 ప్రపంచకప్ లేనట్టే!
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాలోని రెండో అతిపెద్ద నగరమైన మెల్బోర్న్లో మరో ఆరు వారాలపాటు లాక్డౌన్ విధించారు. దీంతో ఆ దేశంలో షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన టీ20 ప్రపంచకప్ నిర్వహణ ఇక కష్టమేననే అభిప్రాయం అంతటా నెలకొంది. ఏ నిర్ణయం తీసుకోకుండా ఐసీసీ జాప్యం చేస్తున్నప్పటికీ ఇక తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని బీసీసీఐ భావిస్తోంది. ‘మెల్బోర్న్లో నెలకొన్న తాజా పరిస్థితుల కారణంగా ఐసీసీ ఈ విషయాన్ని ముగించాల్సి ఉంది. ఈ మెగా టోర్నీ నిర్వహణలో చాలా సమస్యలుంటాయి. అలాగే అక్కడి ప్రజల ఆరోగ్యం కోసం ఆసీస్ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) కూడా ఈ విషయాలపై అవగాహన కలిగి ఉంది’ అని బోర్డుకు చెందిన ఉన్నతాధికారి తెలిపారు. మరోవైపు సెప్టెంబరులో ఇంగ్లండ్తో వన్డే సిరీస్కు సిద్ధంగా ఉండాలంటూ తమ ఆటగాళ్లకు సీఏ తెలిపినట్టు అక్కడి మీడియాలో కథనాలు వచ్చాయి. దీంతో టీ20 ప్రపంచకప్ లేనట్టే అనే వార్తలకు బలం చేకూరినట్టయింది.