లిటన్ దాస్ శతకం
ABN , First Publish Date - 2020-03-02T10:02:34+05:30 IST
లిటన్ దాస్ (126) సెంచరీతో బంగ్లాదేశ్ భారీ విజయాన్ని నమోదు చేసింది. మూడు వన్డేల సిరీ్‌సలో భాగంగా ఆదివారం జరిగిన ...

జింబాబ్వేపై బంగ్లా గెలుపు
సిల్హట్ (బంగ్లాదేశ్): లిటన్ దాస్ (126) సెంచరీతో బంగ్లాదేశ్ భారీ విజయాన్ని నమోదు చేసింది. మూడు వన్డేల సిరీ్‌సలో భాగంగా ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లో బంగ్లా 169 పరుగుల తేడాతో జింబాబ్వేను చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లా నిర్ణీత 50 ఓవర్లలో 321/6 స్కోరు చేసింది. ఛేదనలో జింబాబ్వే 39.1 ఓవర్లలో 152 పరుగులకే ఆలౌటైంది. సైఫుద్దీన్ (3/22) మూడు వికెట్లు పడగొట్టాడు.