ఫిఫా ఉత్తమ ఫుట్‌బాలర్‌ లెవాన్‌డోస్కీ

ABN , First Publish Date - 2020-12-19T06:12:19+05:30 IST

పోలెండ్‌ సాకర్‌ జట్టు కెప్టెన్‌ రాబర్ట్‌ లెవాన్‌డోస్కీ తన కెరీర్‌లో అతి పెద్ద అవార్డు సాధించాడు. 2020 ఫిఫా అత్యుత్తమ పురుష ఆటగాడి అవార్డుకు

ఫిఫా ఉత్తమ ఫుట్‌బాలర్‌ లెవాన్‌డోస్కీ

జ్యూరిచ్‌: పోలెండ్‌ సాకర్‌ జట్టు కెప్టెన్‌ రాబర్ట్‌ లెవాన్‌డోస్కీ తన కెరీర్‌లో అతి పెద్ద అవార్డు సాధించాడు. 2020 ఫిఫా అత్యుత్తమ పురుష ఆటగాడి అవార్డుకు అతడు ఎన్నికయ్యాడు. దిగ్గజ ఫార్వర్డ్‌లు లియోనెల్‌ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డోలను వెనక్కునెట్టిన బాయెర్న్‌ మ్యూనిచ్‌ స్ట్రయికర్‌ లెవాన్‌డోస్కీ ఈ అవార్డు గెలుచుకోవడం విశేషం. జాతీయ జట్ల కెప్టెన్లు, కోచ్‌లు, ఎంపిక చేసిన జర్నలిస్టులు, ఫుట్‌బాల్‌ ఫ్యాన్స్‌ వేసిన ఓట్లతో విజేతను నిర్ణయించారు. రాబర్ట్‌, మెస్సీ, రొనాల్డోతో జాబితాను కుదించారు. వీరిలో లెవాన్‌డోస్కీ 52 ఓట్లతో టాప్‌లో నిలవగా.. రొనాల్డో (38), మెస్సీ (35) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. 

Read more