ఆ సత్తా పాకిస్థాన్‌కు లేదు

ABN , First Publish Date - 2020-03-21T10:18:48+05:30 IST

దాయాది భారత క్రికెట్‌ జట్టు అంటే ఒంటికాలిపై లేచే పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ జావెద్‌ మియాందాద్‌ ఈసారి తమ టీమ్‌ మీదనే తీవ్రమైన విమర్శలు చేశాడు...

ఆ సత్తా పాకిస్థాన్‌కు లేదు

లాహోర్‌: దాయాది భారత క్రికెట్‌ జట్టు అంటే ఒంటికాలిపై లేచే పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ జావెద్‌ మియాందాద్‌ ఈసారి తమ టీమ్‌ మీదనే తీవ్రమైన విమర్శలు చేశాడు. బాబర్‌ ఆజమ్‌ మినహా ఇప్పుడున్న పాక్‌ జట్టులోని బ్యాట్స్‌మెన్‌కు భారత్‌పై ఆడే సత్తా లేదన్నాడు. ‘బాబర్‌ ఆజమ్‌ ఒక్కడే నిలకడగా ఆడుతున్నాడు. భారత్‌, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, దక్షిణాఫ్రికా జట్లపై ఆడే సామర్థ్యం మిగిలిన బ్యాట్స్‌మెన్‌కు లేదు. పాక్‌ జట్టులో మంచి బౌలర్లు ఉన్నారు కానీ, పేలవ బ్యాటింగ్‌ లైన్‌పతో సమస్య ఉత్పన్నమవుతోంది. ఇతర దేశాల్లో ఉత్తమ ప్రదర్శన ఆధారంగా క్రికెటర్లను ఎంపిక చేస్తుంటే పాక్‌లో పది ఇన్నింగ్స్‌లో ఒక్క పరుగు కూడా చేయని ఆటగాళ్లను కొనసాగిస్తూనే ఉన్నారు’ అని మియాందాద్‌ విమర్శించారు.

Updated Date - 2020-03-21T10:18:48+05:30 IST