ఫైనల్లో రెండుసార్లు టాస్‌ వేశాం

ABN , First Publish Date - 2020-05-30T09:08:47+05:30 IST

క్రికెట్‌లో ఏ మ్యాచ్‌ కోసమైనా టాస్‌ వేసేది ఒక్కసారే.. కానీ 2011 వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్లో మాత్రం రెండుసార్లు టాస్‌ వేయాల్సి వచ్చిందని శ్రీలంక మాజీ కెప్టెన్‌

ఫైనల్లో రెండుసార్లు టాస్‌ వేశాం

2011 వరల్డ్‌క్‌పపై సంగక్కర


కోల్‌కతా: క్రికెట్‌లో ఏ మ్యాచ్‌ కోసమైనా టాస్‌ వేసేది ఒక్కసారే.. కానీ 2011 వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్లో మాత్రం రెండుసార్లు టాస్‌ వేయాల్సి వచ్చిందని శ్రీలంక మాజీ కెప్టెన్‌ కుమార సంగక్కర తెలిపాడు. అశ్విన్‌తో కలిసి అతడు ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో పాల్గొన్నాడు. ‘ఆరోజు వాంఖడేలో ప్రేక్షకులు కిక్కిరిసి ఉన్నారు. టాస్‌ పైకి విసిరాక కెప్టెన్‌ ధోనీకి అనుమానం వచ్చి నీవు టెయిల్‌ చెప్పావా? అని అడిగాడు. కాదు హెడ్‌ అన్నాను. మ్యాచ్‌ రెఫరీ టాస్‌ నేను గెలిచానని చెప్పాడు. కానీ ధోనీ అంగీకరించలేదు. నిజానికి నేను మొదట చెప్పిన విషయం ప్రేక్షకుల హోరులో అతడికి వినిపించనట్టుంది. అందుకే కాస్త అయోమయం నెలకొంది. దీంతో మహీ మరోసారి టాస్‌ వేద్దామన్నాడు. మళ్లీ హెడ్‌ పడడంతో ముందుగా మేం బ్యాటింగ్‌కు దిగాం. చివరకు మ్యాచ్‌లో ధోనీ విన్నింగ్‌ షాట్‌ ఆడాక నేను వెనకాల చిరునవ్వుతో కనిపించా. కానీ ఆ నవ్వు వెనక 20 కోట్ల లంకేయుల నిరాశను దాచేశా. ఏదేమైనా మా జట్టు గెలుపోటములను సమానంగా తీసుకునే స్థయిర్యం కలిగి ఉంది’ అని సంగా వివరించాడు.

Updated Date - 2020-05-30T09:08:47+05:30 IST