వరణ్ దెబ్బకు ఢిల్లీ విలవిల.. కోల్‌కతా ఘన విజయం
ABN , First Publish Date - 2020-10-25T01:04:01+05:30 IST
తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నితీశ్ రాణా (53 బంతుల్లో 13 ఫోర్లు, సిక్సర్‌తో 81 పరుగులు), సునీల్ నరైన్

అబుదాబి: ఐపీఎల్లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్-ఢిల్లీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో మోర్గాన్ సేన భారీ విజయం సాధించి ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నితీశ్ రాణా (53 బంతుల్లో 13 ఫోర్లు, సిక్సర్‌తో 81 పరుగులు), సునీల్ నరైన్ (32 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 64 పరుగులు) మెరుపు ఇన్నింగ్స్‌తో భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది.
అనంతరం 195 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఢిల్లీ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 135 పరుగులకే కుప్పకూలింది. వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌కు ఢిల్లీ బ్యాటింగ్ ఆర్డర్ పేక మేడలా కుప్పకూలింది. మరోవైపు పాట్ కమిన్స్ కూడా నిప్పులు చెరిగారు. దీంతో ఢిల్లీ బ్యాట్స్‌మెన్ క్రీజులోకి వచ్చినట్టే వచ్చి పెవిలియన్ చేరారు. తొలి ఓవర్ తొలి బంతికే రహానే (0) వికెట్‌ను కోల్పోవడంతో మొదలైన వికెట్ల పతనం కడదాకా కొనసాగింది.
ధవన్ (6), హెట్మయర్ (10), స్టోయినిస్ (6), అక్సర్ పటేల్ (9) కగిసో రబడ (9) వికెట్లను వెంటవెంటనే కోల్పోయింది. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (38 బంతుల్లో 5 ఫోర్లతో 47 పరుగులు), రిషభ్ పంత్ (33 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్‌తో 27) కాసేపు కోల్‌కతా బౌలర్లను ఎదురొడ్డారు. వీరిద్దరి తర్వాత జట్టులో అత్యధిక పరుగులు చేసింది అశ్విన్ ఒక్కడే. 13 బంతులు ఆడిన అశ్విన్ రెండు ఫోర్లతో 14 పరుగులు చేశాడు. కోల్‌కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 5 వికెట్లు తీసుకోగా, కమిన్స్ మూడు, ఫెర్గూసన్ ఒక వికెట్ పడగొట్టాడు.