చెలరేగిన అయ్యర్.. నైట్‌రైడర్స్ ముందు భారీ టార్గెట్

ABN , First Publish Date - 2020-10-04T03:05:30+05:30 IST

ఐపీఎల్ 2020లో భాగంగా షార్జా క్రికెట్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ కోల్‌కత్తా నైట్‌రైడర్స్ మ్యాచ్‌లో...

చెలరేగిన అయ్యర్.. నైట్‌రైడర్స్ ముందు భారీ టార్గెట్

షార్జా: ఐపీఎల్ 2020లో భాగంగా షార్జా క్రికెట్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ కోల్‌కత్తా నైట్‌రైడర్స్ మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. ఢిల్లీ ఓపెనర్లలో థావన్ 26 పరుగులకే ఔట్ అయినప్పటికీ.. మరో ఓపెనర్ పృథ్వీ షా మాత్రం 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో చెలరేగి 66 పరుగులు చేశాడు. జట్టు భారీ స్కోర్ చేయడంలో తన వంతు పాత్ర పోషించాడు. రిషబ్ పంత్ 17 బంతుల్లో 38 పరుగులు చేశాడు. ఇక.. ఢిల్లీ జట్టు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ సిక్స్‌లు, ఫోర్లతో కోల్‌కత్తా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఆరు సిక్స్‌లు, ఏడు ఫోర్లతో 38 బంతుల్లోనే 88 పరుగులతో రాణించాడు. దీంతో.. ఢిల్లీ జట్టు భారీ స్కోర్ చేయగలిగింది.


కోల్‌కత్తా నైట్‌రైడర్స్ బౌలింగ్‌లో రస్సెల్‌ రెండు వికెట్లు తీయగా, నగర్‌కోటి, వరుణ్ చక్రవర్తికి తలో వికెట్ దక్కింది. 229 పరుగుల లక్ష్యంతో దినేష్ కార్తీక్ సేన బరిలోకి దిగనుంది. భారీ లక్ష్యం నైట్‌రైడర్స్ ముందునప్పటికీ గిల్, నితీష్ రాణా మంచి ఫామ్‌లో ఉండటం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం.

Updated Date - 2020-10-04T03:05:30+05:30 IST