టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోల్‌కత్తా నైట్‌రైడర్స్

ABN , First Publish Date - 2020-10-08T00:46:39+05:30 IST

షేక్ జాయేద్ స్టేడియం వేదికగా జరుగుతున్న కోల్‌కత్తా నైట్‌రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌లో...

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోల్‌కత్తా నైట్‌రైడర్స్

అబుదాబి: షేక్ జాయేద్ స్టేడియం వేదికగా జరుగుతున్న కోల్‌కత్తా నైట్‌రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌లో కోల్‌కత్తా జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ ఎంచుకోవడంపై నైట్‌రైడర్స్ కెప్టెన్ దినేష్ కార్తీక్ మాట్లాడుతూ.. గత రెండు మ్యాచ్‌లుగా తాము తొలుత బ్యాటింగ్ చేశామని, ఆ రెండు మ్యాచ్‌ల్లో అద్భుతంగా రాణించామని చెప్పాడు. ఇవాల్టి మ్యాచ్‌లో జట్టులో ఎలాంటి మార్పు లేదని డీకే తెలిపాడు. చెన్నై జట్టులో చావ్లా స్థానంలో కర్ణ్ శర్మ ఆడనున్నాడు.


Read more