కరోనాను ధైర్యంగా ఎదుర్కొందాం

ABN , First Publish Date - 2020-03-15T10:10:02+05:30 IST

అవసరమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకొని కరోనాకు దూరంగా ఉందామని టీమిండియా కెప్టెన్‌ కోహ్లీ పిలుపునిచ్చాడు.

కరోనాను ధైర్యంగా ఎదుర్కొందాం

న్యూఢిల్లీ: అవసరమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకొని కరోనాకు దూరంగా ఉందామని టీమిండియా కెప్టెన్‌ కోహ్లీ పిలుపునిచ్చాడు. అందరం ధైర్యంగా నిలిచి ఈ మహమ్మారిపై పోరాడదామని అన్నాడు. ‘వ్యాధి నివారణకన్నా నిరోధమే ఉత్తమం. కొన్ని ముందస్తు జాగ్రత్తలు పాటిద్దాం. కోవిడ్‌-19 దరిచేరకుండా చూసుకుందాం. అంతా ధైర్యంగా నిలిచి ఈ మహమ్మారిపై యుద్ధం చేద్దాం’ అని కోహ్లీ ట్వీట్‌ చేశాడు. 

Updated Date - 2020-03-15T10:10:02+05:30 IST