8 ఏళ్ల తర్వాత భారత జట్టు ఖాతాలో చెత్త రికార్డు

ABN , First Publish Date - 2020-03-02T21:58:37+05:30 IST

న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో దారుణంగా ఓడిపోయిన కోహ్లీసే ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది.

8 ఏళ్ల తర్వాత భారత జట్టు ఖాతాలో చెత్త రికార్డు

క్రైస్ట్‌చర్చ్: న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో దారుణంగా ఓడిపోయిన కోహ్లీసేన ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది. పేస లేని బ్యాటింగ్, బౌలింగ్‌తో రెండు టెస్టుల్లోనూ ఓడి 0-2తో సిరీస్‌ను చేజార్చుకున్న భారత జట్టు 8 ఏళ్ల తర్వాత మళ్లీ వైట్‌వాష్ అయింది. 2012లో ఆస్ట్రేలియా చేతిలో 0-4లో వైట్‌వాష్ అయిన భారత జట్టు మళ్లీ ఇన్నాళ్లకు కివీస్ చేతిలో ఘోర పరాభవం ఎదుర్కొంది. ఇక విరాట్ కెప్టెన్సీలో వైట్‌వాష్ అవడం ఇదే తొలిసారి. ధోనీ నుంచి కెప్టెన్సీ పగ్గాలు స్వీకరించిన తర్వాత కోహ్లీ ఇంత ఘోరంగా ఎప్పుడూ ఓడింది లేదు. అంతేకాదు, 2018 నుంచి విదేశాల్లో ఆడిన నాలుగు సిరీస్‌లలో మూడింటిలో కోహ్లీసేన ఓటమి పాలైంది. ఇప్పుడు ఏకంగా వైట్‌వాష్ అయింది. 


కివీస్‌లో అడుగుపెట్టి ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 5-0తో క్లీన్ స్వీప్ జోరుమీదున్నట్టు కనిపించిన భారత జట్టు ఆ తర్వాత చతికిల పడింది. వన్డే, టెస్టు సిరీస్‌లను కివీస్‌కు సమర్పించుకుంది. వన్డే సిరీస్‌ను 0-3తో కోల్పోయిన కోహ్లీ జట్టు.. తొలి టెస్టులో పది వికెట్ల తేడాతో, రెండో టెస్టులో ఏడు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. 

Updated Date - 2020-03-02T21:58:37+05:30 IST