ఫెడరర్ = కోహ్లీ నడాల్‌లా స్మిత్
ABN , First Publish Date - 2020-05-13T09:56:04+05:30 IST
సహజసిద్ధమైన ప్రతిభ కలిగిన విరాట్ కోహ్లీని టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్‌తో పోల్చాడు దక్షిణాఫ్రికా మాజీ బ్యాట్స్‌మన్ ఏబీ డివిల్లీర్స్. అలాగే సమకాలీన క్రికెట్‌లో కోహ్లీతో పోటీలో....

ఛేజింగ్‌లో సచిన్ కంటే విరాట్ బెస్ట్ : డివిల్లీర్స్
న్యూఢిల్లీ: సహజసిద్ధమైన ప్రతిభ కలిగిన విరాట్ కోహ్లీని టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్‌తో పోల్చాడు దక్షిణాఫ్రికా మాజీ బ్యాట్స్‌మన్ ఏబీ డివిల్లీర్స్. అలాగే సమకాలీన క్రికెట్‌లో కోహ్లీతో పోటీలో ఉన్న ఆస్ట్రేలియా స్టార్ స్టీవ్ స్మిత్.. స్పెయిన్ టెన్నిస్ హీరో రఫెల్ నడాల్ స్థాయి ఆటగాడని అన్నాడు. జింబాబ్వే మాజీ బౌలర్, కామెంటేటర్ పొమినె బాంగ్వాతో ఇన్‌స్టాగ్రామ్ చాట్‌లో మాట్లాడిన ఏబీ.. విరాట్, స్మిత్‌లో ఎవరు గొప్ప అన్న ప్రశ్నకు అలా స్పందించాడు. ‘కోహ్లీ.. టెన్ని్‌సలో రోజర్ లాంటివాడు. స్విస్ స్టార్‌లాగా సహజసిద్ధంగా బంతిని ఎదుర్కొంటాడు. టెన్ని్‌సలో నడాల్‌లా స్మిత్ కూడా మానసికంగా చాలా దృఢంగా ఉంటాడు. కానీ, ఇద్దరిలో నా ఓటెవరికంటే కోహ్లీకే వేస్తా’ అని డివిల్లీర్స్ చెప్పుకొచ్చాడు. ఇక ఛేదన విషయానికొస్తే.. సచిన్ టెండూల్కర్ కన్నా కోహ్లీనే ముందుంటాడన్నాడు. ‘కోహ్లీకి, నాకు సచిన్ రోల్ మోడల్. ఆటలో సాధించిన ఘనతలు, మైదానం లోపలా, వెలుపలా అతను వ్యవహరించే తీరు మాకందరికీ ఆదర్శం. అయితే, మ్యాచ్ హోరాహోరీగా సాగుతూ, తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నప్పుడు జట్టును గెలిపించడంలో కోహ్లీ ఎప్పుడూ ముందుంటాడు’ అని ఏబీ అన్నాడు.