సంగక్కర తర్వాత నిలకడైన ఆటగాడు కోహ్లీనే: మాథ్యూస్

ABN , First Publish Date - 2020-07-20T04:07:00+05:30 IST

ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ ఆటగాళ్లలో కోహ్లీ ఒకడని శ్రీలంక ఆల్‌రౌండర్, మాజీ కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ చెప్పాడు.

సంగక్కర తర్వాత నిలకడైన ఆటగాడు కోహ్లీనే: మాథ్యూస్

కొలంబో: ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ ఆటగాళ్లలో కోహ్లీ ఒకడని శ్రీలంక ఆల్‌రౌండర్, మాజీ కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ చెప్పాడు. ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ జోరూట్, ఆసీస్ ప్లేయర్ స్టీవ్ స్మిత్, న్యూజిలాండ్ సారధి కేన్ విలియమ్సన్, ఇండియన్ స్కిప్పర్ కోహ్లీ.. ఈ నలుగురిలో ఉత్తమ బ్యాట్స్‌మెన్‌గా కోహ్లీని ఎంపిక చేశాడు. ‘కుమార సంగక్కర తర్వాత అంత నిలకడైన ఆటగాడు కోహ్లీనే’ అని ఈ సందర్భంగా మాథ్యూస్ కొనియాడాడు. ఇక గణాంకాల విషయానికొస్తే.. వన్డే, టీ20ల్లో ఈ నలుగురు ఆటగాళ్లలో కోహ్లీనే అత్యధిక పరుగులు చేశాడు. టెస్టుల్లో మాత్రం ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ ముందంజలో ఉన్నాడు.

Updated Date - 2020-07-20T04:07:00+05:30 IST