సచిన్ రికార్డును కోహ్లీనే బద్దలుకొట్టగలడు: బ్రాడ్ హాగ్

ABN , First Publish Date - 2020-07-06T00:38:27+05:30 IST

ప్రపంచ క్రికెట్‌లో ఎన్నో రికార్డులను సచిన్ టెండూల్కర్ నమోదు చేశాడు. అందులో 100 సెంచరీల అరుదైన..

సచిన్ రికార్డును కోహ్లీనే బద్దలుకొట్టగలడు: బ్రాడ్ హాగ్

కాన్‌బెర్రా: ప్రపంచ క్రికెట్‌లో ఎన్నో రికార్డులను సచిన్ టెండూల్కర్ నమోదు చేశాడు. అందులో 100 సెంచరీల అరుదైన ఘనత కూడా ఒకటి. ఈ  ఫీట్‌ను సాధించిన ఏకైక ఆటగాడిగా సచిన్ నిలిచాడు. ఈ రికార్డును బద్దలుకొట్టే సత్తా ఎవరైనా క్రికెటర్‌కు ఉందా అంటే.. ప్రస్తుత భారత కెప్టెన్ కోహ్లీ పేరు తప్ప మరే పేరూ వినపడదు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సచిన్ 100 సెంచరీల రికార్డును కోహ్లీ కచ్చితంగా బద్దలు కొడతాడని అన్నాడు. ‘టెండూల్కర్ కాలంలో ఆటగాళ్ల ఫిట్‌నెస్‌కు, ఇప్పటి ఆటగాళ్ల ఫిట్‌నెస్‌కు ఎంతో తేడా ఉంది. అంతేకాకుండా మ్యాచ్‌లు అప్పటితో పోల్చితే ఎక్కువ సంఖ్యలో జరుగుతున్నాయి. ఆటగాళ్లు కూడా ఎక్కువ మ్యాచుల్లో పాల్గొంటున్నారు.  అందుకే కోహ్లీ ఆ రికార్డును కచ్చితంగా బద్దలు కొట్టగలడని చెబుతున్నా’నంటూ హాగ్ చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే 31 ఏళ్ల కోహ్లీ ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌లో 70 సెంచరీలు చేశాడు.

Updated Date - 2020-07-06T00:38:27+05:30 IST