రహానేపై కోహ్లీ ప్రశంసలు

ABN , First Publish Date - 2020-12-29T19:24:39+05:30 IST

తొలి టెస్టులో ఓటమికి ప్రతీకారంగా భారత్ రెండో టెస్టులో పగ తీర్చుకుంది. ఆసీస్‌ను చిత్తుగా ఓడించి సిరీస్ సమం చేసింది. ఈ మ్యాచ్‌లో ఆజింక్య రహానే అద్భుతంగా పోరాడాడు. కెప్టెన్సీలో తనదైన మార్క్...

రహానేపై కోహ్లీ ప్రశంసలు

మెల్‌బోర్న్: తొలి టెస్టులో ఓటమికి ప్రతీకారంగా భారత్ రెండో టెస్టులో పగ తీర్చుకుంది. ఆసీస్‌ను చిత్తుగా ఓడించి సిరీస్ సమం చేసింది. ఈ మ్యాచ్‌లో ఆజింక్య రహానే అద్భుతంగా పోరాడాడు. కెప్టెన్సీలో తనదైన మార్క్ చూపించాడు. భారత్ గెలుపుపై విరాట్ కోహ్లీ ప్రశంసల వర్షం కురిపించాడు. జట్టు అద్భుతంగా ఆడిందని, అందులోనూ ఆజింక్య రహానే జట్టును నడిపించిన తీరు అమోఘమని అభినందించాడు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశాడు. ‘మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియాపై గెలవడం అద్భుతం. టీమిండియా శ్రమించిన తీరు అనిర్వచనీయం. జట్టు విజయం సాధించడం కన్నా సంతోషం ఏదీ లేదు. రహానే తన కెప్టెన్సీతో జట్టును విజయపథంలో నడిపించిన తీరు అసాధారణం. మన జైత్రయాత్ర ఇకముందు కూడా ఇలాగే కొనసాగాలని ఆకాంక్షిస్తున్నానం’టూ కోహ్లీ తన ట్వీట్‌లో పేర్కొన్నాడు.




ఇదిలా ఉంటే తొలి టెస్టులో ఓటమికి ప్రతీకారంగా భారత్ రెండో టెస్టులో పగ తీర్చుకుంది. ఆసీస్‌ను చిత్తుగా ఓడించి సిరీస్ సమం చేసింది. ఈ మ్యాచ్‌లో ఆజింక్య రహానే అద్భుతంగా పోరాడాడు. ముందుండి జట్టును నడింపించాడు. జట్టు అండతో ఆసీస్‌ను అలవోకగా ఓడించాడు. ముఖ్యంగా బ్యాటింగ్‌లో రహాన్ శభాష్ అనిపించుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో రాణించిన రహానే, రెండో ఇన్నింగ్స్‌లోనూ అజేయంగా నిలిచి జట్టుకు గెలుపునందించాడు. శుభ్‌మన్ గిల్‌తో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. దీంతో రహానేకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

Updated Date - 2020-12-29T19:24:39+05:30 IST