టాప్‌-3లో రాహుల్‌

ABN , First Publish Date - 2020-12-10T09:05:03+05:30 IST

ఆస్ట్రేలియాతో టీ20 సిరీ్‌సలో అదరగొట్టిన కేఎల్‌ రాహుల్‌, విరాట్‌ కోహ్లీ ర్యాంకులు మెరుగుపడ్డాయి. బుధవారం విడుదల చేసిన ఐసీసీ టీ20 బ్యాట్స్‌మెన్‌ ర్యాంకింగ్స్‌ జాబితాలో రాహుల్‌ 816 పాయింట్లతో ఆస్ట్రేలియా కెప్టెన్‌ ఫించ్‌ను వెనక్కి నెట్టి...

టాప్‌-3లో రాహుల్‌

దుబాయ్‌: ఆస్ట్రేలియాతో టీ20 సిరీ్‌సలో అదరగొట్టిన కేఎల్‌ రాహుల్‌, విరాట్‌ కోహ్లీ ర్యాంకులు మెరుగుపడ్డాయి. బుధవారం విడుదల చేసిన ఐసీసీ టీ20 బ్యాట్స్‌మెన్‌ ర్యాంకింగ్స్‌ జాబితాలో రాహుల్‌ 816 పాయింట్లతో ఆస్ట్రేలియా కెప్టెన్‌ ఫించ్‌ను వెనక్కి నెట్టి మూడో స్థానాన్ని ఆక్రమించాడు. కోహ్లీ ఒక మెట్టెక్కి.. 8వ ర్యాంక్‌లో నిలిచాడు. మలన్‌ (ఇంగ్లండ్‌), బాబర్‌ ఆజమ్‌ (పాకిస్థాన్‌) టాప్‌-2లో కొనసాగుతున్నారు. బౌలర్లలో భారత స్పిన్నర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ 11వ ర్యాంక్‌ను దక్కించుకొన్నాడు. అఫ్ఘాన్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ టాప్‌లో ఉన్నాడు. ఆల్‌రౌండర్లలో టాప్‌-20లో ఒక్క భారతీయుడికీ చోటు దక్కలేదు. 

Updated Date - 2020-12-10T09:05:03+05:30 IST