పరుగు కోతపై మ్యాచ్ రెఫరీకి ఫిర్యాదు చేసిన పంజాబ్

ABN , First Publish Date - 2020-09-21T22:38:25+05:30 IST

ఢిల్లీ కేపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అంపైర్ తప్పిదం కారణంగా పరాజయం పాలైన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు మ్యాచ్ రెఫరీ జవగళ్

పరుగు కోతపై మ్యాచ్ రెఫరీకి ఫిర్యాదు చేసిన పంజాబ్

దుబాయ్: ఢిల్లీ కేపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అంపైర్ తప్పిదం కారణంగా పరాజయం పాలైన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు మ్యాచ్ రెఫరీ జవగళ్ శ్రీనాథ్‌కు ఫిర్యాదు చేసింది. పరుగులో కోత కారణంగా తమ జట్టు ఓటమి పాలైందని పంజాబ్ జట్టు సీఈవో సతీశ్ మీనన్ పేర్కొన్నారు. అంపైర్ తప్పుడు నిర్ణయ ఫలితం తమ ప్లే ఆఫ్ అవకాశాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.


‘‘మేం మ్యాచ్ రెఫరీకి ఫిర్యాదు చేశాం. మానవ తప్పిదాలు జరగొచ్చు. దానిని మేం అర్థం చేసుకుంటాం. అయితే, ఐపీఎల్ లాంటి ప్రపంచ ప్రఖ్యాత టోర్నమెంటులో ఇలాంటి మానవ తప్పిదాలు తగవు. ఇది మా ప్లే ఆఫ్ అవకాశాలను దెబ్బతీసే అవకాశం ఉంది. మ్యాచ్ ఓడిపోవడమంటే ఓడిపోవడమే. ఇది సరికాదు. నిబంధనలను సమీక్షిస్తారని భావిస్తున్నా. అలా చేస్తే మానవ తప్పిదాలకు అవకాశం ఉండదు’’ అని సతీశ్ మీనన్ పేర్కొన్నారు.  


Updated Date - 2020-09-21T22:38:25+05:30 IST