ఖేలో వర్సిటీ క్రీడల్లో ఉస్మానియాకు రజతం

ABN , First Publish Date - 2020-03-02T10:04:35+05:30 IST

ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్‌లో ఉస్మానియా టేబుల్‌ టెన్నిస్‌ జట్టు త్రుటిలో స్వర్ణం కోల్పోయింది. భువనేశ్వర్‌లో ఆదివారం

ఖేలో వర్సిటీ క్రీడల్లో ఉస్మానియాకు రజతం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్‌లో ఉస్మానియా టేబుల్‌ టెన్నిస్‌ జట్టు త్రుటిలో స్వర్ణం కోల్పోయింది. భువనేశ్వర్‌లో ఆదివారం జరిగిన పురుషుల టీటీ ఫైనల్లో ఉస్మానియా 1-3తో చిట్కారా యూనివర్సిటీ (పంజాబ్‌) చేతిలో పోరాడి ఓడింది. మహిళల 200 మీటర్ల స్ర్పింట్‌లో ద్యూతీ చంద్‌ (కేఐఐటీ) స్వర్ణ పతకం గెలుచుకొంది. ద్యూతీ 23.66 సెకన్లలో రేసును ముగించింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జ్యోతిక శ్రీ (కృష్ణ వర్సిటీ) నాలుగో స్థానంలో నిలిచింది.

Updated Date - 2020-03-02T10:04:35+05:30 IST