వార్నర్ బాటలోనే.. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ టిక్‌-టాక్ వీడియో

ABN , First Publish Date - 2020-05-11T20:11:30+05:30 IST

ఆస్ట్రేలియా విధ్వంసకర ఆటగాడు డేవిడ్ వార్నర్ టిక్-టాక్‌లోనూ అదరగొడుతున్న విషయం తెలిసిందే. తన భార్యతో కలిసి ‘బుట్టబొమ్మ’, మరో

వార్నర్ బాటలోనే.. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ టిక్‌-టాక్ వీడియో

లండన్: ఆస్ట్రేలియా విధ్వంసకర ఆటగాడు డేవిడ్ వార్నర్ టిక్-టాక్‌లోనూ అదరగొడుతున్న విషయం తెలిసిందే. తన భార్యతో కలిసి ‘బుట్టబొమ్మ’, మరో తమిళపాటకి స్టెప్పులు వేసిన వార్నర్.. తాజాగా పోకిరి సినిమాలో మహేశ్‌బాబు చెప్పిన ‘ఒక్కసారి కమిట్ అయితే’ అనే డైలాగ్‌తో టిక్‌-టాక్ వీడియో చేసి అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చాడు.


అయితే డేవిడ్ వార్నర్ బాటలోనే ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్‌సన్ అడుగులు వేస్తున్నాడు. ‘జెంటిల్‌మెన్’ సినిమలోని ‘కొంటెగాన్ని కట్టుకో’ అనే పాటకి పీటర్‌సన్ టిక్-టాక్ వీడియో చేశాడు. ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అయింది. దీంతో అభిమానులు డేవిడ్ వార్నర్, పీటర్‌సన్‌ల టిక్-టాక్‌ వీడియో ఒకదానితో ఒకటి పోలుస్తూ.. ఇద్దరు త్వరలో యాక్టింగ్‌లోకి వస్తారా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.Updated Date - 2020-05-11T20:11:30+05:30 IST