కళ్లకు గంతలతో బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ మాజీ కెప్టెన్
ABN , First Publish Date - 2020-04-21T19:59:04+05:30 IST
ప్రస్తుతం నెలకొన్న ఇబ్బందికర పరిస్థితుల్లో ఇంగ్లండ్ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్‌సన్ ఓ వినూత్నరీతిలో తన అభిమానులకు వినోదం పంచాలని

లండన్: ప్రస్తుతం నెలకొన్న ఇబ్బందికర పరిస్థితుల్లో ఇంగ్లండ్ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్‌సన్ ఓ వినూత్నరీతిలో తన అభిమానులకు వినోదం పంచాలని నిర్ణయించుకున్నారు. మైదానంలో తన బ్యాటింగ్‌తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఆయన.. ఇటీవలే ఓ యూట్యూబ్ ఛానల్‌ని ప్రారంభించారు. ఈ ఛానల్ కోసం కెవిన్ క్రికెట్ ఆడుతున్న ఓ వీడియోని షూట్ చేశారు. అయితే ఈ వీడియోలో తన కళ్లకి గంతలు కట్టుకొని అతను బ్యాటింగ్ చేశారు.
కళ్లకి గంతలు ఉన్నప్పటికీ.. కెవిన్ తన స్టైల్‌లో భారీ సిక్సులు కొట్టడం మనం చూడొచ్చు. ఇందుకు సంబంధించిన ఓ చిన్న క్లిపింగ్‌ను అతను ట్వీట్ చేశాడు. ‘‘కళ్ల గంతలతో నేను ఎలా బ్యాటింగ్ చేశానో చూస్తారా?’’ అంటూ ఈ ట్వీట్‌కి క్యాప్షన్ పెట్టారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు కెవిన్ చేసిన ఈ వినూత్న ప్రయోగంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.