కెప్టెన్సీ.. నా కల

ABN , First Publish Date - 2020-05-09T10:06:37+05:30 IST

దక్షిణాఫ్రికా జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాలనుకుంటున్నట్టు లెఫ్టామ్‌ స్పిన్నర్‌ కేశవ్‌ మహరాజ్‌ తెలిపాడు. ప్రస్తుతానికి పరిమిత ఓవర్లలో క్వింటన్‌ ...

కెప్టెన్సీ.. నా కల

దక్షిణాఫ్రికా స్పిన్నర్‌ కేశవ్‌ మహరాజ్‌

కేప్‌టౌన్‌: దక్షిణాఫ్రికా జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాలనుకుంటున్నట్టు లెఫ్టామ్‌ స్పిన్నర్‌ కేశవ్‌ మహరాజ్‌ తెలిపాడు. ప్రస్తుతానికి పరిమిత ఓవర్లలో క్వింటన్‌ డికాక్‌ జట్టును నడిపిస్తున్నాడు. అయితే ఫిబ్రవరిలో డుప్లెసి టెస్టు సారథిగా రాజీనామా చేశాక ఆ ఫార్మాట్‌లో మాత్రం ఇంకా ఎవరినీ నియమించలేదు. ‘దక్షిణాఫ్రికా జట్టుకు కెప్టెన్‌గా ఉండాలనేది నా కల. నా సన్నిహితులకు ఈ విషయం బాగా తెలుసు. అయితే టెస్టులకే కాకుండా అన్ని ఫార్మాట్లకు సారథిగా వ్యవహరించాలనుకుంటున్నాను. అంతేకాకుండా జట్టు కెప్టెన్‌గా ప్రపంచక్‌పను సగర్వంగా అందుకోవాలనేది నా కోరిక. అప్పుడే నా కెరీర్‌ పరిపూర్ణమవుతుంది’ అని కేశవ్‌ మనసులోని కోరికను వెల్లడించాడు.

Updated Date - 2020-05-09T10:06:37+05:30 IST