మ్యాచ్‌కు ముందే కిక్కు !
ABN , First Publish Date - 2020-03-08T10:25:30+05:30 IST
భారత్-ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్ ఆరంభా నికి ముందే అభిమానులకు ఉర్రూతలూగించేందుకు అమెరికన్ పాప్ సింగర్ కేటీ పెర్రీ సిద్ధమవుతోంది. ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం కావడంతో..

భారత్-ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్ ఆరంభా నికి ముందే అభిమానులకు ఉర్రూతలూగించేందుకు అమెరికన్ పాప్ సింగర్ కేటీ పెర్రీ సిద్ధమవుతోంది. ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం కావడంతో.. క్రికెట్ ఆస్ట్రేలియా ఈ షోను ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. మ్యాచ్‌కు అరగంట ముందు.. మధ్యా హ్నం 12 గంటలకు ఆమె షో మొదలవుతుంది. ఆతర్వాత మ్యాచ్ పూర్తయ్యాక తిరిగి కొనసాగుతుంది. మరోవైపు హర్మన్‌ప్రీత్ కౌర్ సేనను కూడా పెర్రీ కలుసుకుంది. శనివారం భారత జట్టు ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఎంసీజీకి వచ్చిన కేటీ.. వారితో చాలాసేపు ముచ్చటించింది. అలాగే తుది జట్టు గురించి పెర్రీ అడిగిన ప్రశ్నకు జెమీమా రోడ్రిగ్స్ చిలిపిగా బదులిచ్చింది. ‘నాకు రేపు ఉదయం ఫోన్ చేస్తే ఆ 11 మంది పేర్లు చెబుతా’ అని అనడంతో నవ్వులు కురిశాయి.