ఐపీఎల్ ఒక్కటే అంటే..ధోనీ రాణించడం అసాధ్యం: కపిల్
ABN , First Publish Date - 2020-11-03T09:17:40+05:30 IST
మ్యాచ్ ప్రాక్టీస్ లేకుండా ఐపీఎల్‌లో మాత్రమే ఆడతానంటే.. ధోనీ రాణించడం అసాధ్యమని కపిల్‌దేవ్ అన్నాడు. వరల్డ్‌కప్ తర్వాత
న్యూఢిల్లీ: మ్యాచ్ ప్రాక్టీస్ లేకుండా ఐపీఎల్‌లో మాత్రమే ఆడతానంటే.. ధోనీ రాణించడం అసాధ్యమని కపిల్‌దేవ్ అన్నాడు. వరల్డ్‌కప్ తర్వాత మహీ ఐపీఎల్‌లోనే బరిలోకి దిగినా ఆకట్టుకోలేకపోయాడు. ధోనీ ఫామ్‌లోకి రావాలంటే దేశవాళీ క్రికెట్ ఎక్కువగా ఆడాలని కపిల్ సూచించాడు. ‘ఏడాదికోసారి జరిగే ఐపీఎల్ మాత్రమే ఆడాలని మహీ నిర్ణయించుకొంటే సత్తా చాటడం అసాధ్యం. అతడి వయసు రీత్యా.. ఎంత ఎక్కువగా సాధన చేస్తే అంత మంచిది. 10 నెలలపాటు ఎలాంటి క్రికెట్ ఆడకుండా.. ఒక్కసారిగా ఐపీఎల్ అంటే ఏం జరిగిందో చూశారుగా. దేశవాళీ క్రికెట్ ఆడడానికి మహీకి మంచి అవకాశం’ అని కపిల్ చెప్పాడు.