జోఫ్రా అర్చర్‌కు వార్నింగ్.. మూడో టెస్టుకు అందుబాటులో పేసర్

ABN , First Publish Date - 2020-07-19T02:47:35+05:30 IST

బయో సెక్యూర్ ప్రొటోకాల్స్‌ను ఉల్లంఘించిన ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా అర్చర్‌ను ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు

జోఫ్రా అర్చర్‌కు వార్నింగ్.. మూడో టెస్టుకు అందుబాటులో పేసర్

మాంచెస్టర్: బయో సెక్యూర్ ప్రొటోకాల్స్‌ను ఉల్లంఘించిన ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా అర్చర్‌ను ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) జరిమానా విధించడంతోపాటు హెచ్చరించింది. అలాగే, మూడో టెస్టులో ఆడేందుకు అర్చర్‌కు లైన్ క్లియర్ చేసింది. గురువారం ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో విండీస్‌తో రెండో టెస్టు ప్రారంభానికి ముందు అర్చర్‌ను జట్టు నుంచి తప్పిస్తూ మేనేజ్‌మెంట్ నిర్ణయం తీసుకుంది. 


ఈ నెల 13న బయో సెక్యూర్ ప్రొటోకాల్స్‌ను ఉల్లంఘించిన అర్చర్ అనధికారికంగా హోవ్‌లోని తన ఇంటికి వెళ్లాడు. దీనిని తీవ్రంగా పరిగణించిన బోర్డు శుక్రవారం జరిమానా విధించడంతోపాటు హెచ్చరికలు జారీ చేసింది. అయితే, జరిమానా మొత్తాన్ని బయటపెట్టలేదు. కాగా, అర్చర్‌కు మాత్రం ఆటగాళ్లు అండగా నిలిచారు.  కాగా, అర్చర్ ఐదు రోజులపాటు సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండనున్నాడు. అలాగే, రెండుసార్లు కొవిడ్-19 పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. ఐసోలేషన్ ముగిసేలోగా తప్పకుండా నెగటివ్ అని ఫలితాలు రావాల్సి ఉంటుంది. కాగా, చివరిదైన మూడో టెస్టుకు ముందు మంగళవారం అర్చర్ జట్టుతో కలవనున్నాడు.  

Updated Date - 2020-07-19T02:47:35+05:30 IST