జంషెడ్‌పూర్ గెలుపు
ABN , First Publish Date - 2020-12-19T06:11:26+05:30 IST
ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎ్‌సఎల్)లో జంషెడ్‌పూర్ ఎఫ్‌సీ రెండో విజయం సాధించింది. నార్త్‌ఈస్ట్ యునైటెడ్ ఎఫ్‌సీతో శుక్రవారం

పనాజి: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎ్‌సఎల్)లో జంషెడ్‌పూర్ ఎఫ్‌సీ రెండో విజయం సాధించింది. నార్త్‌ఈస్ట్ యునైటెడ్ ఎఫ్‌సీతో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో జంషెడ్‌పూర్ 1-0 స్కోరుతో గెలుపొందింది. తొలి అర్ధభాగంలో లభించిన గోల్ అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో ఇరు జట్లూ విఫలమయ్యాయి. అయితే ద్వితీయార్ధంలో అనికేత్ జాదవ్ (53వ నిమిషం) గోల్‌తో జంషెడ్‌పూర్ మ్యాచ్‌ను దక్కించుకొంది.