కోవిడ్-19 విరాళాల కోసం.. బ్యాట్, జెర్సీ వేలం వేసిన పేస్ బౌలర్

ABN , First Publish Date - 2020-04-26T20:31:26+05:30 IST

కరోనా వైరస్‌ను అరికట్టేందకు మద్దతుగా విరాళం అందజేసేందుకు తను ఆడిన చివరి మ్యాచ్‌లో ధరించిన జెర్సీ, ఆడిన బ్యాట్‌ను వేలంలో పెడుతున్నట్లు

కోవిడ్-19 విరాళాల కోసం.. బ్యాట్, జెర్సీ వేలం వేసిన పేస్ బౌలర్

లండన్: కరోనా వైరస్‌ను అరికట్టేందకు మద్దతుగా విరాళం అందజేసేందుకు తను ఆడిన చివరి మ్యాచ్‌లో ధరించిన జెర్సీ, ఆడిన బ్యాట్‌ను వేలంలో పెడుతున్నట్లు ఇంగ్లండ్ సీనియర్ పేస్ బౌలర్ జేమ్స్ ఆండర్‌సన్ ప్రకటించాడు. కేప్‌టౌన్ వేదికగా ఈ ఏడాది జనవరిలో సౌతాఫ్రికాతో అతను చివరి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో అతను ఏడు వికెట్లు తీయగా.. ఇంగ్లండ్ 189 పరుగుల తేడాతో విజయం సాధించింది. 


అయితే ఈ మ్యాచ్‌లో ఉపయోగించిన తన బ్యాట్, జెర్సీ, స్టంప్‌ని ‘ఈబే’లో వేలంలో పెట్టి ఆ డబ్బును ‘గో వెల్ ఫండ్’ అనే సంస్థ ద్వారా కోవిడ్-19తో బాధపడుతున్న వారి వైద్యానికి అందిస్తామని ఆండర్‌సన్ ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. అంతేకాక.. వాటిపై తను సంతకం కూడా ఉంటుందని అతను పేర్కొన్నాడు. ఇప్పటివరకూ 151 టెస్టులు ఆడిన ఆండర్‌సన్ 26.83 యావరేజ్‌తో 584 వికెట్లు తీశాడు. మరో 16 వికెట్లు తీస్తే.. 600 టెస్ట్ వికెట్లు తీసిన నాలుగో బౌలర్‌గా అతను రికార్డుల్లోకెక్కుతాడు.

Updated Date - 2020-04-26T20:31:26+05:30 IST