ఆసీస్‌తో పోరు కోసం. జడేజా నయా ఎక్సర్‌సైజ్!

ABN , First Publish Date - 2020-11-25T19:49:37+05:30 IST

ఆసీస్ టూర్ కోసం ఆస్ట్రేలియా చేరుకున్న భారత జట్టు.. కంగారూలపై గెలుపు కోసం చాలా ప్రాక్టీస్ చేస్తోంది. ఈ క్రమంలోనే భారత స్పిన్నర్ రవీంద్ర జడేజా ఓ నయా ఫిట్‌నెస్ ఎక్సర్ సైజ్ చేస్తున్నాడు.

ఆసీస్‌తో పోరు కోసం. జడేజా నయా ఎక్సర్‌సైజ్!

ఇంటర్నెట్ డెస్క్: ఆసీస్ టూర్ కోసం ఆస్ట్రేలియా చేరుకున్న భారత జట్టు.. కంగారూలపై గెలుపు కోసం చాలా ప్రాక్టీస్ చేస్తోంది. ఈ క్రమంలోనే భారత స్పిన్నర్ రవీంద్ర జడేజా ఓ నయా ఫిట్‌నెస్ ఎక్సర్ సైజ్ చేస్తున్నాడు. దీనికి సంబంధించిన ఓ వీడియోను బీసీసీఐ ట్వీట్ చేసింది. ‘వర్షం పడినా, ఎండ కాసీనా ఈ తొందర మాత్రం ఆగదు’ అంటూ ఈ పోస్టు పెట్టింది బీసీసీఐ. దీనీలో జడేజా ఓ కార్ట్ లాంటి బండిని నెడుతూ పరిగెడుతున్నాడు. ఆసీస్ టూర్‌లో భాగంగా భారత్ మూడు టీ20లు, మూడు వన్డేలు, నాలుగు టెస్టులు ఆడనుంది. జడేజా చివరగా యూఏఈలో జరిగిన ఐపీఎల్‌లో ఆడాడు. చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించిన జడేజా ఈ సీజన్‌లో బాగానే రాణించాడు. కానీ ఈ జట్టు పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో సీజన్ ముగించిన విషయం తెలిసిందే.Updated Date - 2020-11-25T19:49:37+05:30 IST

Read more