ధోనీ, కోహ్లీ సరసన చేరినందుకు సంతోషం: జడేజా

ABN , First Publish Date - 2020-12-30T11:39:25+05:30 IST

భారత స్టార్ ఆల్‌రౌండ్ రవీంద్ర జడేజా అరుదైన ఘనత సాధించాడు. టీ20, వన్డే, టెస్టులు.. ఇలా మూడు ఫార్మాట్లలోనూ కనీసం 50 మ్యాచులు ఆడిన భారత ఆటగాడిగా నిలిచాడు.

ధోనీ, కోహ్లీ సరసన చేరినందుకు సంతోషం: జడేజా

మెల్‌బోర్న్: భారత స్టార్ ఆల్‌రౌండ్ రవీంద్ర జడేజా అరుదైన ఘనత సాధించాడు. టీ20, వన్డే, టెస్టులు.. ఇలా మూడు ఫార్మాట్లలోనూ కనీసం 50 మ్యాచులు ఆడిన భారత ఆటగాడిగా నిలిచాడు. ఇంతకు ముందు ఈ ఘనత భారత మాజీ కెప్టెన్ ఎమ్ఎస్ ధోనీ, ప్రస్తుత సారధి విరాట్ కోహ్లీ మాత్రమే సాధించారు. ఇలా మూడు ఫార్మాట్లలో రాణించడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుందని నిపుణులు అంటున్నారు. తను ఈ ఘన సాధించిన సందర్భంగా జడేజా.. ధోనీ, కోహ్లీతో మూడు ఫార్మాట్లలో కలిసి ఉన్న ఫొటోలను షేర్ చేసుకున్నాడు. ‘‘మహి భాయ్, విరాట్ క్లబ్బులో చేరడం ఓ గొప్ప గౌరవం’’ అని పేర్కొన్నాడు. ఇప్పటి వరకూ జడేజా అంతర్జాతీయ స్థాయిలో 50 టెస్టు మ్యాచులు, 168 వన్డేలు, 50 టీ20లు ఆడాడు.

Updated Date - 2020-12-30T11:39:25+05:30 IST