ఆస్ట్రేలియాతో టెస్టులకు ముందు భారత్‌కు ఎదురుదెబ్బ
ABN , First Publish Date - 2020-11-28T01:09:17+05:30 IST
ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. టెస్టు సిరీస్‌కు రోహిత్ శర్మ, ఇషాంత్ శర్మ అందుబాటులో

సిడ్నీ: ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. టెస్టు సిరీస్‌కు రోహిత్ శర్మ, ఇషాంత్ శర్మ అందుబాటులో ఉండే విషయంలో స్పష్టత లేదని కోహ్లీ చెప్పగా, తాజాగా దీనిపై బీసీసీఐ అప్‌డేట్ ఇచ్చింది. కండరాల నొప్పితో బాధపడుతున్న ఇషాంత్ ఇంకా కోలుకోకపోవడంతో జట్టుకు దూరమైనట్టు బోర్డు తెలిపింది. సిరీస్ నాటికి ఫిట్‌నెస్ సాధిస్తానని ఇషాంత్ చెప్పాడని, అయితే సిరీస్ త్వరలోనే ప్రారంభం కానుండడంతో అప్పటికి అది సాధ్యమయ్యేనా? అన్న ప్రశ్న తలెత్తుతోందని పేర్కొంది.
రోహిత్ ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) లో ఫిట్‌నెస్ పెంచుకునే పనిలో ఉన్నాడు. డిసెంబరు 11న ఎన్‌సీఏ అతడిని మరోమారు పరీక్షిస్తుంది. ఆ తర్వాత అతడి ఆసీస్ పర్యటనపై స్పష్టత వస్తుంది. మరోవైపు, నవదీప్ సైనీ వెన్నునొప్పితో బాధపడుతుండడంతో తమిళనాడు పేసర్ టి నటరాజన్‌ను వన్డే జట్టుకు బ్యాకప్ ప్లేయర్‌గా తీసుకున్నారు.