తొలి మ్యాచ్‌లో నా షూ లేకుంటే.. జహీర్ నుంచి అప్పు తీసుకున్న: ఇశాంత్

ABN , First Publish Date - 2020-05-30T23:28:10+05:30 IST

టీం ఇండియా సీనియర్ ఆటగాళ్లలో ఇశాంత్ శర్మ ఒకడు. ఇప్పటికే 97 టెస్టులు ఆడిన ఇశాంత్.. టీం ఇండియా పేస్‌ బౌలింగ్‌లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అయితే యువ

తొలి మ్యాచ్‌లో నా షూ లేకుంటే.. జహీర్ నుంచి అప్పు తీసుకున్న: ఇశాంత్

టీం ఇండియా సీనియర్ ఆటగాళ్లలో ఇశాంత్ శర్మ ఒకడు. ఇప్పటికే 97 టెస్టులు ఆడిన ఇశాంత్.. టీం ఇండియా పేస్‌ బౌలింగ్‌లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అయితే యువ క్రికెటర్ మయాంక్ అగర్వాల్‌తో తాజాగా నిర్వహించిన ఇంటర్వ్యూలో ఇశాంత్ తన ఆరంగేట్ర మ్యాచ్‌కి సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. 


ఐర్లాండ్‌లోని బెల్ఫాస్ట్‌లో 2007 జూన్‌లో జరిగిన మ్యాచ్‌లో ఇశాంత్ అంతర్జాతీయ వన్డేల్లోకి అడుగుపెట్టాడు. అయితే ఈ మ్యాచ్‌లో అతని వద్ద కిట్ లేకపోవడంతో.. అతను షూలను మరో పేసర్ జహీర్ ఖాన్ నుంచి అప్పుగా తీసుకున్నానని ఇశాంత్ తెలిపాడు. ‘‘సౌతాఫ్రికాతో జరిగే వన్డేలకు తొలుత నేను ఎంపిక కాలేదు. దాంతో నేను హాయిగా ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఉన్నపళంగా నేను వన్డేలకు ఎంపిక అయ్యాను అని కాల్ వచ్చింది. అయితే నా లగేజీ విమానంలోనే ఉండిపోయింది. నేను మేనేజర్‌ని అడిగితే అది నేరుగా హోటల్ రూంకి వస్తుందని చెప్పాడు’’ అని ఇశాంత్ అన్నాడు. 


అయితే తాను ప్రాక్టీస్ చేయకుండా ఉండటంతో.. రాహుల్ ద్రవిడ్ వచ్చిన ఏం జరిగిందని అడిగాడని.. అప్పుడు అసలు విషయం వెల్లడించానని తెలిపాడు. ‘‘ప్రతీ ఒక్కరు ప్రాక్టీస్ చేస్తున్నారు. నేను చేతులు కట్టుకొని నిలుచున్నాను . అప్పుడు రాహుల్ ద్రవిడ్ వచ్చి ‘ఇశాంత్ ఎందుకు బౌలింగ్ చేయడం లేదు’ అని అడిగాడు. దాంతో నా వద్ద షూ లేదని అప్పుడు అతనికి చెప్పాను. నా లగేజీ విమానంలో ఉండిపోయిందని.. ఇంకా రాలేదని తెలిపాను. అందుకు ద్రవిడ్ ‘అలా ఎలా జరుగుతుంది. విమానంలో ఉన్న లగేజీ కచ్చితంగా వచ్చి తీరుతుంది. మరి నువ్వు ఎలా ఆడుతావు’ అని అన్నాడు. దాంతో నేను జహీర్ షూలను అప్పుగా తీసుకొని ఆడాను’’ అని ఇశాంత్ వెల్లడించాడు. 

Updated Date - 2020-05-30T23:28:10+05:30 IST