వచ్చే ఐపీఎల్‌ కూడా యూఏఈలోనే?

ABN , First Publish Date - 2020-09-20T09:00:15+05:30 IST

దేశంలో కరోనా మహమ్మారి అదుపులోకి రాకపోతే బీసీసీఐ ఆతిథ్య సిరీ్‌సలకు యూఏఈ ప్రత్యామ్నాయ వేదికగా మారే అవకాశం ఉందని తాజా ..

వచ్చే ఐపీఎల్‌ కూడా యూఏఈలోనే?

దుబాయ్‌: దేశంలో కరోనా మహమ్మారి అదుపులోకి రాకపోతే బీసీసీఐ ఆతిథ్య సిరీ్‌సలకు యూఏఈ ప్రత్యామ్నాయ వేదికగా మారే అవకాశం ఉందని తాజా పరిణామాలు సంకేతాలిస్తున్నాయి. క్రికెట్‌ సంబంధాల బలోపేతం కోసం బీసీసీఐ, ఎమిరేట్స్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ)లు శనివారం అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ‘ఇరుదేశాల మధ్య క్రికెట్‌ సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు నేను, ఈసీబీ ఉపాధ్యక్షుడు ఖలీద్‌ అల్‌ జరూనీ ఓ ఎంవోయూపై సంతకాలు చేశాం. టోర్నీల ఆతిథ్యానికి ఒప్పందం కుదుర్చుకున్నాం’ అని బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపారు. ఒప్పందంలోని విషయాలు బయటకు రాలేదు. కానీ, కరోనా విజృంభణ ఇలాగే కొనసాగితే వచ్చే ఏడాది అంటే ఐపీఎల్‌-2021ని కూడా యూఏఈలోనే నిర్వహించేలా ఒప్పందం చేసుకున్నట్టు సమాచారం. 

Updated Date - 2020-09-20T09:00:15+05:30 IST