యూసుఫ్ పఠాన్‌కి హెయిర్‌కట్ చేసిన ఇర్ఫాన్ పఠాన్

ABN , First Publish Date - 2020-04-28T22:15:13+05:30 IST

కరోనా వ్యాప్తిని అరికట్టేందకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ అంత తమ ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే ప్రజల్లో, తమ

యూసుఫ్ పఠాన్‌కి హెయిర్‌కట్ చేసిన ఇర్ఫాన్ పఠాన్

కరోనా వ్యాప్తిని అరికట్టేందకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ అంత తమ ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే ప్రజల్లో, తమ అభిమానులకు వినోదం పంచేందుకు సెలబ్రిటీలు, క్రీడాకారులు తమ ఇళ్లలో చేస్తున్న పనులను సోషల్‌మీడియా ద్వారా పంచుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితం బాలీవుడ్ నటి, టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ.. తన భర్తకు హెయిర్‌కట్ చేసిన ఫొటోలను సోషల్‌మీడియా ద్వారా పంచుకుంది. తాజాగా టీం ఇండియా ఆటగాడు యూసుఫ్ పఠాన్‌కి తన సోదరుడు ఇర్ఫాన్ పఠాన్ హెయిర్‌కట్ చేశాడట. ఈ విషయాన్ని యూసుఫ్ సోషల్‌మీడియా ద్వారా వెల్లడిచాండు.  హెయిర్‌కట్‌కి ముందు.. ఆ తర్వాత ఫొటోలతో పాటు.. ఇర్ఫాన్ తనకు కట్టింగ్ చేస్తున్న ఫొటోలను అతను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నాడు. ఈ ఫొటోలు కొంత సమయంలోనే సోషల్‌మీడియాలో వైరల్ అయ్యాయి. 


కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా ఏర్పడిన సంక్షోభంలో పఠాన్ సోదరులు తమ వొంతు సహాయాన్ని అందిస్తున్నారు. కష్టాల్లో ఉన్న వారికి నిత్యవసరాలు, కూరగాయలు, ఇతర వస్తువులను వాళ్లు స్వయంగా అందజేస్తున్నారు. ఇప్పటికే పఠాన్ సోదరులు 10వేల కిలోల బియ్యం, 700 కిలోల బంగాలదుంపలను బరోడాలో పంపిణీ చేశారు.

Updated Date - 2020-04-28T22:15:13+05:30 IST