ఐపీఎల్ ప్రైజ్ మనీ మారింది.. 20 కోట్లు కాదు..!

ABN , First Publish Date - 2020-03-04T22:20:16+05:30 IST

ఐపీఎల్ ఛాంపియన్ జట్టుకు, రన్నరప్ జట్టుకు ప్రతీ సీజన్‌లో ఇచ్చే ప్రైజ్ మనీ విషయంలో...

ఐపీఎల్ ప్రైజ్ మనీ మారింది.. 20 కోట్లు కాదు..!

ఐపీఎల్ ఛాంపియన్ జట్టుకు, రన్నరప్ జట్టుకు ప్రతీ సీజన్‌లో ఇచ్చే ప్రైజ్ మనీ విషయంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ ఛాంపియన్ జట్టుకు ఇచ్చే ప్రైజ్ మనీని రూ.20 కోట్ల నుంచి రూ.10 కోట్లకు తగ్గించినట్లు సమాచారం. రన్నరప్ జట్టుకు రూ.12.5 కోట్లకు బదులుగా రూ.6.25 కోట్లు మాత్రమే ఇవ్వనున్నట్లు తెలిసింది. క్వాలిఫయర్ మ్యాచుల్లో ఓడిన రెండు జట్లకు రూ. 4.37 కోట్లు మాత్రమే దక్కనున్నట్లు సమాచారం. ఈ మేరకు ఐపీఎల్ ఫ్రాంచైజీలకు బీసీసీఐ సర్క్యులర్ పంపినట్లు జాతీయ మీడియాలో వార్తలొస్తున్నాయి. ఖర్చులను తగ్గించుకునే ఉద్దేశంతోనే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.


ఇదిలా ఉంటే.. కరోనా కలకలం నేపథ్యంలో ఐపీఎల్ వాయిదా పడే అవకాశం ఉందన్న ప్రచారంపై బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ స్పందించారు. షెడ్యూల్‌లో ఎలాంటి మార్పు లేదని, ఐపీఎల్ యథావిధిగా తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని స్పష్టం చేశారు. మార్చి 29 నుంచి ఐపీఎల్ సందడి మొదలుకానుంది. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది.

Updated Date - 2020-03-04T22:20:16+05:30 IST