మెరిపించి అవుటైన అయ్యర్.. చప్పగా సాగుతున్న మ్యాచ్!

ABN , First Publish Date - 2020-09-21T02:17:02+05:30 IST

కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ బ్యాటింగ్ చప్పగా సాగుతోంది. 13 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన

మెరిపించి అవుటైన అయ్యర్.. చప్పగా సాగుతున్న మ్యాచ్!

దుబాయ్: కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ బ్యాటింగ్ చప్పగా సాగుతోంది. 13 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన పంత్‌తో కలిసి కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ జట్టు భారాన్ని తన భుజాలపై వేసుకున్నాడు. వికెట్ పడకుండా జాగ్రత్త పడుతూ స్కోరు బోర్డును నెమ్మదిగా ముందుకు కదిలించాడు. మరోవైపు, రిషభ్ పంత్ కూడా దూకుడుకు పోకుండా నిదానంగా ఆడుతూ కెప్టెన్‌కు సహకరించాడు. కాస్త కుదురుకున్నట్టు అనిపించాక అయ్యర్ బ్యాట్ ఝళిపించడం మొదలుపెట్టాడు.


మూడు సిక్సర్లు బాదడంతో స్కోరు బోర్డులో ఒక్కసారిగా చలనం వచ్చింది. జట్టు గాడిన పడిందనుకుంటున్న సమయంలో యువ బౌలర్ బిష్ణోయ్ బౌలింగ్‌లో పంత్ బౌల్డ్ అయ్యారు. 29 బంతులు ఎదుర్కొన్న పంత్ 4 ఫోర్లతో 31 పరుగులు చేశాడు. షమీ వేసిన ఆ తర్వాతి ఓవర్ తొలి బంతికే కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కూడా పెవిలియన్ బాట పట్టాడు. 32 బంతులు ఎదుర్కొన్న అయ్యర్ 3 సిక్సర్లతో 39 పరుగులు చేసి షమీకి దొరికిపోయాడు. ప్రస్తుతం 14.1 ఓవర్లు ముగిసే సరికి  ఢిల్లీ 5 వికెట్ల నష్టానికి 87 పరుగులు చేసింది.

Updated Date - 2020-09-21T02:17:02+05:30 IST