ఐపీఎల్ వాయిదా.. ప్రకటించిన బీసీసీఐ

ABN , First Publish Date - 2020-03-13T20:32:56+05:30 IST

ఐపీఎల్ ప్రియులకు బ్యాడ్ న్యూస్. ఈ నెల 29 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ మ్యాచ్‌లు వాయిదా పడ్డాయి.

ఐపీఎల్ వాయిదా.. ప్రకటించిన బీసీసీఐ

ముంబై: ఐపీఎల్ ప్రియులకు బ్యాడ్ న్యూస్. ఈ నెల 29 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ మ్యాచ్‌లు వాయిదా పడ్డాయి. వచ్చే నెల 15 నుంచి ప్రారంభం కానున్నట్టు బీసీసీఐ ప్రకటించింది. కరోనా ఎఫెక్ట్‌తో బీసీసీఐ తాజా నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్‌లు నిర్వహించాలని కేంద్ర క్రీడాశాఖ సూచించడంతో.. ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఆలోచనలో పడ్డాయి. మరోవైపు మ్యాచ్‌ల నిర్వహణకు హర్యానా, ఢిల్లీ, ముంబై, కర్ణాటక నిరాకరించాయి. దీంతో రెండు వారాలు ఐపీఎల్‌ను వాయిదా వేయాలంటూ బీసీసీఐని ఫ్రాంచైజీలు కోరాయి. ఫ్రాంచైజీల అభ్యర్థన మేరకు బీసీసీఐ తాజా నిర్ణయం తీసుకుంది.Updated Date - 2020-03-13T20:32:56+05:30 IST