భారత ఆటగాళ్లు స్వార్థపరులు

ABN , First Publish Date - 2020-04-24T10:04:14+05:30 IST

భారత బ్యాట్స్‌మెన్‌ జట్టు ప్రయోజనాల కంటే వ్యక్తిగత స్వార్థం కోసమే శతకాలు చేసేవారని పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్‌ ఇంజమామ్‌ ఉల్‌ హక్‌ ...

భారత ఆటగాళ్లు స్వార్థపరులు

పాక్‌ మాజీ కెప్టెన్‌ ఇంజమామ్‌

న్యూఢిల్లీ: భారత బ్యాట్స్‌మెన్‌ జట్టు ప్రయోజనాల కంటే వ్యక్తిగత స్వార్థం కోసమే శతకాలు చేసేవారని పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్‌ ఇంజమామ్‌ ఉల్‌ హక్‌ వ్యాఖ్యానించాడు. కానీ, పాక్‌ ఆటగాళ్లు మాత్రం వారికి విరుద్ధంగా ఆడేవారన్నాడు. తాను ఆడే రోజుల్లో భారత్‌, పాక్‌ జట్ల మధ్య ప్రధాన వ్యత్యాసాల గురించి పాక్‌ మాజీ ఆటగాడు రమీజ్‌ రాజా యూట్యూబ్‌ చానెల్‌లో ఇంజీ మాట్లాడాడు. ‘భారత్‌తో తలపడిన రోజుల్లో పేపర్‌పై వారి బ్యాటింగ్‌ ఎంతో బలంగా కనిపించేది. కానీ, మా బ్యాట్స్‌మెన్‌ 30, 40 పరుగులు చేసినా అవి జట్టు కోసమే. భారత ఆటగాళ్లు మాత్రం తమ స్వార్థం కోసమే సెంచరీలు చేసేవార’ని అన్నాడు. ఇరుజట్ల మధ్య ఇదే ప్రధాన తేడా అని.. అందుకే తాను ఆడిన సమయంలో భారత్‌పై తమదే మెరుగైన రికార్డని ఇంజీ చెప్పాడు. 

Updated Date - 2020-04-24T10:04:14+05:30 IST