న్యూజిలాండ్-పాకిస్తాన్ మ్యాచులో ఇంటెలిజెంట్ ఫ్యాన్.. పాక్ తప్పులు లెక్కెడుతూ..

ABN , First Publish Date - 2020-12-28T05:25:45+05:30 IST

న్యూజిలాండ్-పాకిస్తాన్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచులో ఓ వింత దృశ్యం కనిపించింది. ఈ మ్యాచులో ఓ ఫ్యాన్.. పాకిస్తాన్ జట్టు చేసిన తప్పులను లెక్కెడుతూ కనిపించాడు.

న్యూజిలాండ్-పాకిస్తాన్ మ్యాచులో ఇంటెలిజెంట్ ఫ్యాన్.. పాక్ తప్పులు లెక్కెడుతూ..

ఆక్లాండ్: న్యూజిలాండ్-పాకిస్తాన్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచులో ఓ వింత దృశ్యం కనిపించింది. ఈ మ్యాచులో ఓ ఫ్యాన్.. పాకిస్తాన్ జట్టు చేసిన తప్పులను లెక్కెడుతూ కనిపించాడు. ఓ బోర్డుపై ఈ తప్పులను రాస్తున్న ఇతని ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ బోర్డుపై ‘వదిలేసిన క్యాచులు’, ‘మిస్‌ఫీల్డ్స్’, ‘పూర్ త్రోలు’, ‘అనవసర డీఆర్ఎస్ వినియోగం’ వంటి తప్పులను అతను రాసుకున్నాడు. పాకిస్తాన్ జట్టు వీటిలో ఓ తప్పు చేసిన ప్రతిసారీ.. ఈ ఫీల్డులో ఓ గీత పెడుతూ వచ్చాడు. ఇలా పాక్ జట్టు తప్పులను లెక్కపెడుతున్న ఈ ఫ్యాన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు. దీనిపై క్రికెట్ అభిమానులు సరదాగా స్పందిస్తున్నారు. ‘‘తెలివైన అభిమానులు ఉండటం మ్యాచును మరింత ఆసక్తికరంగా మారుస్తుంది’’ అని కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - 2020-12-28T05:25:45+05:30 IST