‘తప్పుడు వయస్సు’కు రెండేళ్ల వేటు

ABN , First Publish Date - 2020-08-04T09:10:33+05:30 IST

దేశవాళీ క్రికెట్‌లో నకిలీ జనన ధ్రువీకరణ పత్రాలతో జరుగుతున్న మోసాలకు బీసీసీఐ చెక్‌ పెట్టనుంది. దీనిలో భాగం గా అలాంటి ...

‘తప్పుడు వయస్సు’కు రెండేళ్ల వేటు

న్యూఢిల్లీ: దేశవాళీ క్రికెట్‌లో నకిలీ జనన ధ్రువీకరణ పత్రాలతో జరుగుతున్న మోసాలకు బీసీసీఐ చెక్‌ పెట్టనుంది. దీనిలో భాగం గా అలాంటి ప్రయత్నాలు చేసే వారిపై రెండేళ్ల నిషేధం విధించనున్నట్టు పేర్కొంది. మరోవైపు ఇప్పటి వరకు తమ వయస్సును తక్కువగా పేర్కొంటూ నకిలీ సర్టిఫికెట్‌ సమర్పించి ఆడుతున్న క్రికెటర్లకు బీసీసీఐ ఆఫర్‌ ఇచ్చింది. తమంతట తామే పొరపాటును అంగీకరించి సెప్టెంబరు 15 లోపు అసలైన బర్త్‌ సర్టిఫికెట్‌ అందిస్తే క్షమిస్తామని స్పష్టం చేసింది.

Updated Date - 2020-08-04T09:10:33+05:30 IST