భారత్‌కు జరిమానా

ABN , First Publish Date - 2020-12-10T09:11:21+05:30 IST

ఆస్ట్రేలియాతో ఆఖరిదైన మూడో టీ20లో స్లో ఓవర్‌రేట్‌ కారణంగా టీమిండియాకు జరిమానా విధించారు. నిర్ణీత సమయంలో భారత జట్టు ఒక ఓవర్‌ తక్కువగా వేయడంతో మ్యాచ్‌ రెఫరీ డేవిడ్‌ బూన్‌ టీమిండియా మ్యాచ్‌ ఫీజులో 20 శాతం ఫైన్‌ వేశాడు...

భారత్‌కు జరిమానా

సిడ్నీ: ఆస్ట్రేలియాతో ఆఖరిదైన మూడో టీ20లో స్లో ఓవర్‌రేట్‌ కారణంగా టీమిండియాకు జరిమానా విధించారు. నిర్ణీత సమయంలో భారత జట్టు ఒక ఓవర్‌ తక్కువగా వేయడంతో మ్యాచ్‌ రెఫరీ డేవిడ్‌ బూన్‌ టీమిండియా మ్యాచ్‌ ఫీజులో 20 శాతం ఫైన్‌ వేశాడు. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ తమ తప్పిదాన్ని ఒప్పుకోవడంతో పాటు జరిమానాకు కూడా అంగీకారం తెలిపాడు. కాబట్టి కోహ్లీ అధికారిక విచారణకు హాజరు కావాల్సిన అవసరం లేదని ఐసీసీ తెలిపింది. ఈ మ్యాచ్‌లో భారత్‌ 12 పరుగుల తేడాతో ఓడి.. 2-1తో సిరీస్‌ను ముగించిన సంగతి తెలిసిందే. 

Updated Date - 2020-12-10T09:11:21+05:30 IST