అడిలైడ్‌లో టీమిండియా క్వారంటైన్‌

ABN , First Publish Date - 2020-07-22T09:08:49+05:30 IST

ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్న భారత జట్టు అడిలైడ్‌లో 14 రోజులపాటు క్వారంటైన్‌లో ఉండనుంది. ఈ విషయాన్ని క్రికెట్‌ ఆస్ట్రేలియా ...

అడిలైడ్‌లో టీమిండియా క్వారంటైన్‌

మెల్‌బోర్న్‌: ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్న భారత జట్టు అడిలైడ్‌లో 14 రోజులపాటు క్వారంటైన్‌లో ఉండనుంది. ఈ విషయాన్ని క్రికెట్‌ ఆస్ట్రేలియా తాత్కాలిక చీఫ్‌ నికీ హాక్లే మంగళవారం వెల్లడించారు. అయితే నికీ ప్రకటన బీసీసీఐ చీఫ్‌ సౌరవ్‌ గంగూలీ అభిప్రాయానికి భిన్నంగా ఉండడం గమనార్హం. ఆ పర్యటనలో టీమిండియాకు రెండు వారాల క్వారంటైన్‌ అవసరంలేదని గతంలో గంగూలీ పేర్కొన్న సంగతి తెలిసిందే. క్వారంటైన్‌ నిబంధనల ప్రకారం కోహ్లీ సేనకు, సహాయక సిబ్బందికి అత్యుత్తమ శిక్షణ సదుపాయాలు కల్పిస్తామని నికీ చెప్పారు. ‘మేం సరైన జాగ్రత్తలు పాటించకపోతే ప్రమాదం ఎదుర్కొంటాం. ఓల్డ్‌ట్రాఫర్డ్‌, ఏజియస్‌ బౌల్‌ మాదిరి అడిలైడ్‌ స్టేడియంలో హోటల్‌ సదుపాయం ఉంది’ అని ఆయన వివరించారు. 

Updated Date - 2020-07-22T09:08:49+05:30 IST