కోలుకున్నా.. నెగెటివ్‌ వచ్చింది

ABN , First Publish Date - 2020-09-03T09:55:34+05:30 IST

భారత స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగట్‌ కొవిడ్‌ నుంచి కోలుకుంది. ఇప్పుడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని, రెండుసార్లు పరీక్ష ..

కోలుకున్నా.. నెగెటివ్‌ వచ్చింది

న్యూఢిల్లీ: భారత స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగట్‌ కొవిడ్‌ నుంచి కోలుకుంది. ఇప్పుడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని, రెండుసార్లు పరీక్ష చేసుకుంటే నెగెటివ్‌ ఫలితం వచ్చిందని బుధవారం ట్వీట్‌ చేసింది. ఇటీవల అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్‌ ఖేల్‌రత్నకు ఎంపికైన వినేశ్‌.. కొవిడ్‌ పాజిటివ్‌గా తేలడంతో గతనెల 29న జరిగిన అవార్డుల కార్యక్రమానికి కూడా దూరమైన సంగతి తెలిసిందే. ‘మంగళవారం కొవిడ్‌ పరీక్ష చేయించుకున్నా. నెగెటివ్‌ అని వచ్చింది. సంతోషంగా ఉంది. ముందు జాగ్రత్త కోసం మరికొన్ని రోజులు ఐసొలేషన్‌లో ఉంటా. ఆ తర్వాత ప్రాక్టీస్‌ ప్రారంభిస్తా’ అని వినేశ్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. 

Updated Date - 2020-09-03T09:55:34+05:30 IST