ధోని రిటైర్మెంట్‌కు కరోనా కూడా కారణమే: చాహల్

ABN , First Publish Date - 2020-08-20T22:38:46+05:30 IST

ధోనీ రిటైర్మెంట్‌కు కరోనా కూడా ఓ కారణమని భారత స్పిన్నర్ యుజ్వేంధ్ర చాహల్ అన్నాడు. ధోనీ రిటైర్మెంట్ తనను షాక్‌కు గురిచేసిందని, కనీసం టీ20 ప్రపంచ కప్‌..

ధోని రిటైర్మెంట్‌కు కరోనా కూడా కారణమే: చాహల్

న్యూఢిల్లీ: ధోనీ రిటైర్మెంట్‌కు కరోనా కూడా ఓ కారణమని భారత స్పిన్నర్ యుజ్వేంధ్ర చాహల్ అన్నాడు. ధోనీ రిటైర్మెంట్ తనను షాక్‌కు గురిచేసిందని, కనీసం టీ20 ప్రపంచ కప్‌ వరకూ కొనసాగుతాడని భావించానని చెప్పాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడే సత్తా ధోనీకి ఇప్పటికీ ఉందని, అతడి లాంటి వికెట్ కీపర్ జట్టుకు మళ్ళీ లభించడం అసాధ్యమని చాహల్ తెలిపాడు. ‘నేను, కుల్దీప్ యాదవ్ క్రికెట్‌లో నిలదొక్కుకోవడానికి ధోనీనే కారణం. అతడి నుంచి ఎంతో నేర్చుకున్నాం. పిచ్ ఎలా ఉందో ధోనీ ముందుగానే అంచనా వేయగలడు. వికెట్ల వెనుక ధోనీ ఉంటే నా పని సులువు అవుతుంద’ని చాహల్ పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే ధోనీ కోసం ఫేర్‌వెల్ మ్యాచ్ నిర్వహించే విషయంపై కూడా చాహల్ స్పందించాడు. ఫేర్‌వెల్ మ్యాచ్ నిర్ణయం బీసీసీఐ చేతిలో ఉంటుందని, ధోనీ నిర్ణయం కూడా దానికి అవసరమని అభిప్రాయపడ్డాడు.

Updated Date - 2020-08-20T22:38:46+05:30 IST